ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవను గ్రామంలోని పలు పురవీధుల గుండా భక్తి పారవశ్యంతో సాగించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. దసరా పర్వదిన వేళ స్వామివారి ఊరేగింపు గ్రామంలో పండుగ సందడిని నింపింది. భక్తులు పల్లకి సేవలో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ శివశంకర్, ఉపసర్పంచ్ శ్రీను, మాజీ సర్పంచ్ బాలు నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు మధు, వేణుగోపాల్ చారి పాల్గొన్నారు. వాహన సేవకులు ఏడుకొండలు, సతీష్, వెంకటేష్, నవీన్, సుధాకర్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి