ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజా సమస్యలపై అధికార ఆర్తనాదాలు సరికాదు!


 


నాయుడుపేటలో స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి


అధికారులు స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం: బీఆర్ఎస్ నాయకుడు మేకల ఉదయ్ కుమార్


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అధికారంలో ఉండి ప్రజలకు అవసరమైన  స్మశాన వాటిక సమస్యపై దృష్టి సారించకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే,  ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం మంచిదని ఎదులాపురం మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మేకల ఉదయ్ కుమార్ హితవు పలికారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట 3వ, 25వ డివిజన్ల ప్రజలకు సంబంధించిన స్మశాన వాటిక సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ భూమిలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో ఆర్‌సీసీ కాంక్రీట్ ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో నాయుడుపేట ప్రజలు స్మశాన వాటికను పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసరమైన స్మశాన వాటిక విషయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని పేర్కొన్నారు.


ప్రజా సమస్యల పరిష్కారమే పాలకుల ప్రాధాన్యత కావాలి


ప్రజలకు అవసరమైన స్మశాన వాటిక సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని మేకల ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు స్మశాన వాటిక ఏర్పాటు చేపించాల్సింది పోయి గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రజలను ఏ మార్చే చర్యగా ఉంది తప్ప పరిష్కారంపై చూపే దక్షతగా కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం కంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. స్మశాన వాటిక సమస్యపై ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ప్రజలకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, అక్కడ స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నాయుడుపేట స్మశాన వాటిక సమస్యను పరిష్కరించకపోతే ప్రజల తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేపడతామని  హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది