ప్రజాపక్షం/నేలకొండపల్లి: అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కె.వి. రామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని మండ్రాజుపల్లిలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే మహాసభల్లో దేశవ్యాప్తంగా రైతు ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారని పేర్కొన్నారు. మహాసభల ప్రచారంలో భాగంగా ఈ నేడు నేలకొండపల్లి మండలంలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీని రైతులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మందడపు మురళీకృష్ణ, బలుసు ప్రమీల, కాల్వ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎస్ మహాసభల జయప్రదానికి ఇంటింటి ప్రచారం నేడు మండలంలో భారీ బైక్ ర్యాలీ
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి