విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కవిత భౌతికకాయానికి ఘన నివాళులు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన చల్ల ఉపేందర్ భార్య చల్ల కవిత (26) శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి మృతురాలి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయసులోనే కవిత మృతి చెందడం బాధాకరమని, ఇద్దరు చిన్న కుమార్తెలను వదిలి వెళ్లడం కుటుంబానికి తీరని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కవిత మృతి తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. బాధిత కుటుంబ పరిస్థితిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సురేష్, గుర్రం రాకేష్ రెడ్డి, యర్ర శేఖర్, రామిశెట్టి రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గంగారపు యాదగిరి, ఏపూరి తరుణ్, వడ్లకొండ భుజంగరావు, పొన్నెకంటి రమేష్, మల్లయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి