ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: హీరో ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామ కూడలిలో శుక్రవారం అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలేటి నవీన్, కళ్లెం సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రభాస్‌పై అభిమానాన్ని సేవా కార్యక్రమం ద్వారా చాటుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకుడు చుండూరు కృష్ణ, యువకులు కళ్లెం భాస్కర్, కళ్లెం ధర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి