మంత్రి పొంగులేటి మార్గదర్శకత్వంలో.. తుంబూరు దయాకర్ రెడ్డి ఆశీస్సులతో నూతన బాధ్యతలు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా టీఎన్జీవోస్ కాలనీకి చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కిషన్ నాయక్‌కు మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. నూతన బాధ్యతల ద్వారా గిరిజన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కిషన్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కాలనీవాసులు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి