ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జూనియర్ బాలికల జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ


 

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ :  ఖమ్మం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న 48వ జూనియర్‌ బాలికల జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2026 పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ ను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు భీమనాదుల అశోక్ రెడ్డి, సెక్రటరీ వరికూటి మోహన్, కోశాధికారి కోపిల తంబి, చీఫ్ ప్యాట్రన్ వేముల ఆది, నాయకులు లింగాల రవికుమార్, కాంగ్రెస్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, నాయకులు యువ గోపి, సంఘం ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు,క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది