ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వనమా ట్రస్ట్ చేయూత


 

ప్రజా పక్ష/వైరా: ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ట్రస్ట్ చైర్మన్ వనమా వేణుగోపాలరావు (సూరి), ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ ప్రధాన కార్యదర్శి పెనుగొండ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు వనమా ట్రస్ట్ ఆధ్వర్యంలో డిక్షనరీలు, కాంపాక్స్‌లు, పెన్నులు, రాత సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనమా కిరణ్‌కుమార్, కార్తీక్, మిట్టపల్లి కిరణ్, నూకల శ్రీనివాసరావు, మిట్టపల్లి సత్యంబాబు, వజినేపల్లి చక్రవర్తి, కొణతాలపల్లి సుజిత్, మాలే ఉదయ్‌తేజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమా వెంకట సీతారామారావు, రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది