ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రామారావు హత్య కేసులో అసలు నిందితులను అరెస్టు చేయాలి...సిట్ ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి


 

భట్టి, ఖమ్మం సీపీ దిష్టిబొమ్మల దహనానికి పోలీసుల అడ్డంకులు

ప్రజాపక్షం/చింతకాని: పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో అసలు నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని, కేసును తప్పుదోవ పట్టిస్తున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను తక్షణమే బదిలీ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. సీపీఎం చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం సీపీ సునీల్ దత్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీలు తమ నిరసనను తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రామారావు హత్య కేసులో అసలు నిందితులను పక్కనపెట్టి అమాయకులను నిందితులుగా చూపించడం అన్యాయమని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో ధర్నాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం నేత హత్య కేసులో న్యాయం కోరుతూ నిరసన తెలిపితే ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, సీపీఎంకు మరో న్యాయమా అని నిలదీశారు. రామారావు హత్య కేసులో సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్, నాయకులు వత్సవాయి జానకిరాములు, కొండ్రు జానకిరామయ్య, కాటబత్తిన వీరబాబు,గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది