ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎమ్మెల్యే రాందాస్ నాయక్


 


ప్రజాపక్షం/వైరా: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దంపతులు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ దంపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మాజీ రాష్ట్ర చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్న గొప్ప సాంస్కృతిక వేడుక అని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని, మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతుందని అన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం నాయకులు, వారి కుటుంబ సభ్యులు మహిళలతో కలిసి కోలాట నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా బతుకమ్మలను సాగనంపే కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాపా మురళీకృష్ణ,కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి , వీరంశెట్టి,సీతారాములు, కౌన్సిలర్ ముళ్లపటి విజయ, వేముల శ్రావణి ఉండ్రు వరలక్ష్మి, తాటిపూడి సర్పంచ్ జవాజ అశ్విని తాత నిర్మల, డాక్టర్ మురళీకృష్ణా, మచ్చ బుజ్జి, పణితి సైదులు, శ్యాం బాబు రత్నగరు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది