ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కొలువుదీరిన TPTF నూతన కార్యవర్గం


 


@ హక్కుల రక్షణే ఎజెండా..

@ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా యాకయ్య, భద్రు 

@ హాజరైన రాష్ట్ర నాయకత్వం

 

 ప్రజాపక్షం/కూసుమంచి:  ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టిపిటిఎఫ్ కూసుమంచి మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా యాకయ్య,భద్రులను సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. స్థానిక కూసుమంచి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టి పి టి ఎఫ్ ఒక ప్రకటనలో తెలియజేసింది.. 


@ పాఠశాల విద్యను 

బలోపేతం చేయాలి


కూసుమంచి మండల శాఖ కార్యవర్గ ఎంపిక సందర్భంగా జరిగిన సమావేశానికి టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి మనోహర్ రాజు తో పాటు ఉపాధ్యాయ దర్శిని పత్రిక సంపాదకులు నాగిరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మల్లయ్య, వెంగళరావు, మహిళా ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, ప్రత్యేక అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వీరస్వామి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ రాజు మాట్లాడుతూ పాఠశాల విద్యను పరిరక్షించాల్సిన బాధ్యత ఉద్యోగులుగా సంఘాలుగా మనందరిపై ఉందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా నూతన వరవడులను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణలో టిపిటిఎఫ్ సంఘం ఎప్పుడు ముందుంటుందని, పోరాటాల ద్వారానే డిమాండ్లను సాధించుకోగలమని ఆయన పునరుద్గాటించారు.


@ ఉపాధ్యక్షులుగా మదనాచారి, స్వరూప, సాయికుమార్, నవీన్..


టి పి టి ఎఫ్ కూసుమంచి మండల శాఖ కార్యవర్గంలో భాగంగా ఉపాధ్యక్షులుగా మదనాచారి, స్వరూప, సాయికుమార్, నవీన్ ను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా శంకర్, ఉపేందర్ ,శివరాం ,సలీమా, బిక్షం కొనసాగనన్నారు. అదేవిధంగా ఆడిట్ కమిటీ కన్వీనర్ గా కృష్ణ ప్రసాద్, అకాడమిక్ సెల్ కన్వీనర్గా శీను, జీవోల కమిటీ కన్వీనర్ గా వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ గా అమృ నియమితులయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా భాస్కర్, వీరన్న నరసింహారావు, సృజన లక్ష్మయ్యలు పనిచేయనున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది