ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

శిథిలావస్థ ఇంట్లోనే జీవనం.. ఆదర్శంగా కాంగ్రెస్ నేత మంకెన వాసు జీవనశైలి!



 



ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్‌ను వీడని నిబద్ధత.

రాజకీయ సంబంధాలను వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించుకోని వైఖరి

కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి



 రాజకీయాల్లో పదవులు పరిచయాలు పెరిగితే ఆ తర్వాత వారి జీవిత శైలే మారిపోతుంది. వాటితో ఆర్థికంగా బలపడటంతో పాటు ఆడంబర జీవితాన్ని అనుభవిస్తుంటారు. కానీ కాంగ్రెస్ నాయకుడు మంకెన శ్రీనివాసరావు అలియాస్ మంకెన వాసు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని, గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగినా నేటికీ వందేళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లోనే నివసిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్నా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కంటే పార్టీ, ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రజాపక్షం ప్రత్యేక కథనం. ప్రజాపక్షం/కూసుమంచి:



సర్పంచి స్థాయి నుంచి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి వరకు

1995లో ముత్యాలగూడెం గ్రామ సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన మంకెన వాసు, గ్రామస్థాయి రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సహకార సంఘం ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, విద్యా కమిటీ ఎన్నికలు, ఇతర రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ ప్రజలతో తన సంబంధాలను కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ ప్రయాణంలో విజయాలతో పాటు ఓటములూ ఎదురయ్యాయి. 2003 ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఇతర రాజకీయ పరిణామాలు, విభేదాలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాలకే తన రాజకీయ జీవితాన్ని పరిమితం చేయకుండా, ప్రజల మధ్య కొనసాగుతూ పార్టీ కార్యకర్తగా తన బాధ్యతలను నిర్వహించడం ఆయన ప్రస్థానంలో మరో ముఖ్యమైన కోణం.

ముత్యాలగూడెం పేరు వినిపించడంలో తనదైన పాత్ర!

 1994 టైం నుండి అనేక మార్లు పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన సoబాని చంద్రశేఖర్, తో ఆయనకున్న అనుబంధం పరిచయాలతో ఇంకా 1992లో ఎంపీగా గెలిచిన పీవీ రంగయ్య నాయుడుతో ఉన్న పరిచయాలు ఇంకా ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుక చౌదరి, చేగమ్మ దొరవారు రామసహాయం సురేందర్ రెడ్డి తో ఉన్న పరిచయాలు నేటి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డితో ఉన్న పరిచయాలు  2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన దివంగత రాజశేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి  తో ఉన్న పరిచయాలు అయితేనేమి ముత్యాలగూడెం గ్రామానికి రాజకీయంగా గుర్తింపు రావడంలో మంకెన వాసు పాత్ర ఉందని ఆయన అభిమానులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ సమస్యలను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తన వంతు ప్రయత్నాలు చేయడం ద్వారా గ్రామ రాజకీయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారని వారు పేర్కొంటున్నారు. 2006వ సంవత్సరంలో  7 సంవత్సరంలో ముత్యాల గూడెం నుండి చేగొమ్మకు రహదారి తీసుకురావడంలోనూ నిర్మించడంలోనూ ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంది ఇంకాగ్రామంలో అంతర్గతరహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు ఎస్సీ బీసీలకు కార్పొరేషన్ లోన్లు  వంటి ప్రభుత్వ సహకారపథకాలు అందించడంతో  పాటు రైతులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నించడం ఆయన ప్రజా జీవితంలో భాగమైంది. గ్రామ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

రేషన్ కార్డు నుంచి ఆసుపత్రి వైద్యం వరకు.. ప్రజల సమస్యల్లో తోడుగా!

ప్రజలకు రేషన్ కార్డుల సమస్యలు ఎదురైనా, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనా, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సకు సంబంధించిన సమస్యలు తలెత్తినా సంబంధిత వ్యక్తులకు అందుబాటులో ఉండటం మంకెన వాసు దినచర్యలో భాగమని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సహాయం అందేలా సంబంధిత వైద్య సిబ్బందితో మాట్లాడటం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందే విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వంటి పనుల్లో ఆయన చొరవ చూపుతున్నారని స్థానికులు పేర్కొంటారు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, సమస్యను విని పరిష్కార మార్గం కోసం ప్రయత్నించడం రాజకీయ కార్యకర్తగా తన బాధ్యతగా భావిస్తారని ఆయన సన్నిహితులు వివరిస్తుంటారు. ప్రజా సేవ అంటే కేవలం సభలు, సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాదని, సామాన్యులకు అవసరమైన సమయంలో అండగా నిలవడంలోనూ దాని అసలు అర్థం ఉందనే భావన ఆయన ప్రజా జీవితంలో కనిపిస్తుంది.

కులాలకు, వర్గాలకు అతీతంగా ప్రజలతో అనుబంధం

సామాజికంగా భిన్న వర్గాలకు చెందిన ప్రజలతో కలిసి పనిచేయడం మంకెన వాసు గ్రామస్థాయి రాజకీయ ప్రయాణంలో ప్రస్తావించదగిన అంశం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన, మాదిగ, గౌడ, యాదవ తదితర వర్గాల ప్రజలతోనూ రాజకీయ, సామాజిక సంబంధాలను కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, సామాజిక అనుబంధాలు, ప్రజల సమస్యలపై స్పందన ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేయడం ఆయన రాజకీయ జీవితంలో భాగమైంది.

ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిచయాలు

మంకెన వాసుకు కూసుమంచి మండలానికే పరిమితమైన పరిచయాలు కాకుండా, ఖమ్మం జిల్లా నలుమూలల్లోనూ, రాష్ట్రస్థాయిలోనూ రాజకీయ పరిచయాలు, గుర్తింపు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతుంటారు. పార్టీ కార్యక్రమాలు, రాజకీయ సంబంధాలు, ప్రజా సమస్యలపై చొరవ ద్వారా వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో పరిచయాలను కొనసాగిస్తున్నారని పేర్కొంటారు. ఒక గ్రామంలో ప్రారంభమైన రాజకీయ ప్రయాణం, కాలక్రమేణా జిల్లా స్థాయి పార్టీ బాధ్యతల వరకు చేరడం వెనుక నిరంతర రాజకీయ అనుబంధం, కార్యకర్తలతో సంబంధాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలు కీలకంగా నిలిచాయి.

మంత్రి పొంగులేటితో సుదీర్ఘ అనుబంధం



రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంకెన వాసుకు సుదీర్ఘ రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటారు. మంత్రి పదవి లేని సమయంలోనూ మిత్రుడిగా, పదవిలో ఉన్న సమయంలోనూ విశ్వాసపాత్రుడైన అనుచరుడిగా సంబంధాన్ని కొనసాగిస్తూ, ప్రస్తుతం కూడా ఆ అనుబంధాన్ని నిలబెట్టుకున్నారని వారు వివరిస్తున్నారు.
రాజకీయాల్లో అధికారాలు, పదవులు మారుతుంటాయి. అయితే వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాలు కాలంతో పాటు కొనసాగడం రాజకీయ ప్రయాణంలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంకెన వాసుకు ఉన్న అనుబంధాన్ని ఆయన అభిమానులు ఇదే కోణంలో ప్రస్తావిస్తుంటారు. ఈ రాజకీయ పరిచయాల ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతారు.

ప్రతి తండాలో.. ప్రతి గూడెంలో వినిపించే పేరు 'వాసన్న..వాసన '

కూసుమంచి మండలంలోని గ్రామాలు, తండాలు, గూడేల్లో మంకెన వాసును 'వాసన్న' అని ఆప్యాయంగా పిలుచుకునే వారు ఉన్నారని ఆయన అభిమానులు చెబుతుంటారు. 'వాసన్న.. వాసన్న' అంటూ ప్రజలు పలకరించడం తనకు లభించిన గుర్తింపుగా వారు అభివర్ణిస్తారు. రాజకీయాల్లో ఒక నాయకుడి పేరు ప్రజల్లో వినిపించడానికి పదవులే కారణం కావు. ప్రజలతో నిరంతర సంబంధాలు, వారి సమస్యలను వినడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం కూడా కారణమవుతాయి. మంకెన వాసు రాజకీయ ప్రయాణాన్ని ఆయన అనుచరులు ఈ కోణంలో వివరిస్తున్నారు.

ఓటములు ఎదురైనా.. ప్రజల మధ్యే ప్రయాణం

రాజకీయాల్లో ప్రతి ఎన్నిక విజయం సాధించాలనే హామీ ఉండదు. ఓటములు, విభేదాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు సహజం. మంకెన వాసు కూడా తన రాజకీయ ప్రయాణంలో ఇలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలతో తన అనుబంధాన్ని నిలబెట్టుకోవడం ఆయన ప్రయాణంలో ప్రధానంగా కనిపించే అంశం.


 మంకెన వాసు విజయ దుందిబిలు

 
 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంకెనవాసం అందవేసిన చేయిగా గెలిపించుకున్న పంచాయతీలను పరిశీలిస్తే 1995లో ముత్యాల గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంకెన వాసు విజయం సాధించారు. ఇంకా ఆయన చేతుల మీదుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీగ్రామ సర్పంచ్లు 2001లో తాళ్లపల్లి సుభద్రాన్ని గెలిపించుకున్నారు, 2006లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలై సిపిఎం కలిసినప్పటికీ, అనంతరం జరిగిన 2013 గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కోటా లలితను గెలిపించుకున్నారు, ఆ తర్వాత 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బొల్లికొండ శీను ను గెలిపించుకున్నారు, ఆ తర్వాత జరిగిన20 25 గ్రామపంచాయతీ ఎన్నికల్లో పేరెల్లి అశోక్ ను గెలిపించుకున్న చరిత్ర కేవలం వాసుకే దక్కుతుంది.  

 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో

 చేగొమ్మ,ముత్యాల గూడెం రెండు గ్రామాలను కలిపి ఏర్పాటు చేసిన ఎంపీటీసీ ఎన్నికల్లో 1995లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంలో వాసు పాత్ర ఆమోగంగా ఉన్నది అదే సందర్భంలో జరిగిన జెడ్పిటిసి ఎన్నికల్లో ముత్యాల గూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థికి అధిక సంఖ్యలో ఓట్లు వేయించినది కూడా తనే. తర్వాత జరిగిన 2001 ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంకెన  వాసు పరాజయం పాలయ్యారు. ఇదే క్రమంలో జడ్పిటిసి ఎన్నికల్లో ముత్యాల గూడెం గ్రామం నుంచి అధిక ఓట్లు వేయించిన ఘనుడు కూడా మంకెన వాసే, తర్వాత 2006 ఇంకా 2014, 2019లో జరిగిన ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో సైతం ముత్యాల గూడెం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు  అత్యధికంగా ఓట్లు వేయించిన ఘనత సైతం వాస్కే దక్కుతుంది. 1995 నుండి 2025 వరకు జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల లో సైతం గ్రామం నుండి అధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకే  వేయించుకోవడం కూడా తన రాజకీయ నైపుణ్యానికి ఇదో మచ్చుతునక 

 విద్యా కమిటీ ఎన్నికలు

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో అనగా 2000 సంవత్సరం మినహా  2013లో బొల్లికొండ సత్యమును విద్యా కమిటీ చైర్మన్ గా చేయడంలోనూ 2016లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాంపాటి సుజాత  ఆ తరువాత 2019లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ విద్యా కమిటీ చైర్మన్ అభ్యర్థి సుజాత ఆ తర్వాత తెలంగాణప్రభుత్వం మార్చిన రూల్స్ ప్రకారం డ్వాక్రా మహిళలు సైతం తన అనీలే అనే స్కూల్ బాధ్యులుగా నిలపడంలో తనదైన పాత్ర గణనీయంగా ఉన్నదని చెప్పడంలో నిస్సందేహం  2021 2026 వరకు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కువసార్లు  విద్యా కమిటీ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించడంలో వాసు ఘనమైన పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. 

 పిఎసిఎస్ ఎన్నికల్లో

 వాసు రాజకీయ అరంగేట్రం నుండి చేగొమ్మ పిఎసిఎస్ (రైతు సహకార సంఘాలు) ఎన్నికల్లో సైతం అనేకమార్లు ముత్యాలగూడెం నుండి డైరెక్టర్లను గెలిపించుకోవడం లో ఆయనదే అందవేసిన చేయి అయినప్పటికీ 2020లో జరిగిన చేగొమ్మ  పిఎసిఎస్ ఎన్నికల్లో పరాజయాన్ని కూడా చవి చూడడం  జరిగింది. ఏదేమైనా ఇప్పటికీ తన
65 ఏళ్ల వయసులోనూ ప్రజా జీవితంతో సంబంధాలను కొనసాగిస్తూ, కాంగ్రెస్పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నాలు చేయడం ఆయన రాజకీయ జీవితానికి కొనసాగింపుగా నిలుస్తోంది.

ప్రత్యర్ధుల దాడులు నిర్బంధం


 జూన్ 2023లో ముత్యాల గూడెం గ్రామంలో ప్రత్యర్ధులతో జరిగిన రాజకీయ దాడులు ఘర్షణలను మంకెన వాసు ఎంతో విరోచితంగా ఎదుర్కోవటం జరిగింది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ప్రమాదం ఉన్న భయపడకుండా తను పోలీసుల దాడి నుండి బయటపడే క్రమంలో మోకాలు చిప్ప పగలటం కాలుకి గాయమై రక్తంతో తన ఇంటి మెట్లు సైతం తడిచాయి అదె క్రమంలో అజ్ఞాత జీవితం గడిపి హైకోర్టుకెళ్లి యాంటీ స్పెక్టర్ బెల్ పై ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరు కావడం మంకెన  వాసు రాజకీయ జీవితంలో మరిచిపోని నిర్బంధ దాడుల చరిత్రగా చెప్పవచ్చును. ఈ దాడుల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేకమార్లు అతనికి తోడుగా నిలిచి ముత్యాల గూడెం గ్రామానికి వచ్చి అండగా నిలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని విడవక 2023లో నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అతని విజయంకై అలుపెరగని పోరాటపటoతో ముత్యాల గూడెం గ్రామంలో నుండి అధిక ఓట్లు కాంగ్రెస్కే మేయించుకోవడంలో మంకెన వాస అందవేసిన చేయి ఇంకా 2025లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఉన్న మూడు పార్టీలు ఒకటైన కాంగ్రెస్ పార్టీకి 151  ఓట్ల మెజార్టీ తో పేరెల్లి అశోక్ ను గ్రామ సర్పంచ్ గా గెలిపించుకోవడంలో   మంకెన వాసు తనకు ఉన్న రాజకీయపరపతి ఏమిటో ప్రజల్లోనే తెలుసుకోవడం జరిగింది . వాసుకు ఈ పరిణామాలన్నీ చెరిగిపోని రాజకీయ చరిత్ర గానే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి  సందేహం లేదు.

ముగింపు : నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం, గ్రామ సర్పంచిగా నిర్వహించిన బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత, ప్రారంభం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ మారకుండా పార్టీని కాపాడటంలో తనదైన ముద్ర వేసుకున్నారు మంకెన వాసు. జిల్లా స్థాయి పార్టీ బాధ్యతలు, ప్రజా సమస్యలపై స్పందన, వివిధ వర్గాల ప్రజలతో సంబంధాలు, రాజకీయ నాయకులతో కొనసాగిస్తున్న అనుబంధం—ఇవన్నీ మంకెన శ్రీనివాసరావు అలియాస్ మంకెన వాసు ప్రస్థానంలోని ముఖ్యమైన అంశాలు. పార్టీ నుంచి జీతభత్యాలు ఆశించకుండా కార్యకర్తగా, నాయకుడిగా పనిచేయడం, ఇతర ఆదాయ మార్గాల పై దృష్టి లేకుండా కేవలం ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నాననే ఆయన అనుచరుల అభిప్రాయం, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రత్యేకంగా వివరిస్తున్నాయి. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి. ఎన్నికల్లో విజయాలు వస్తాయి.. ఓటములు ఎదురవుతాయి. కానీ ప్రజలతో ఏర్పడిన అనుబంధం, కష్టకాలంలో అందుబాటులో ఉండే స్వభావం, సమాజం కోసం పనిచేయాలనే సంకల్పం ఒక రాజకీయ కార్యకర్త ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచే అంశాలు. ముత్యాలగూడెం గ్రామం నుంచి ప్రారంభమైన మంకెన శ్రీనివాసరావు అలియాస్ మంకెన వాసు రాజకీయ ప్రస్థానం, నాలుగు దశాబ్దాల పార్టీ అనుబంధం, ప్రజలతో కొనసాగిస్తున్న సంబంధాలు, గ్రామాభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాల సమాహారంగా నిలుస్తోంది. ఆయన ప్రయాణాన్ని అభిమానులు ఒకే మాటలో వర్ణిస్తున్నారు—“పదవుల కోసం కాదు.. ప్రజల మధ్య ఉండటమే రాజకీయ జీవితం!” 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది