ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం జిల్లా కోర్టుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు


 

2021 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసు విచారణకు హాజరు


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2021 డిసెంబర్‌లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి మంగళవారం ఆయన కోర్టుకు వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయనతో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో భాగంగా రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయనతో పాటు మిక్కిలినేని నరేంద్ర, ఐనాల నరసింహారావు, బచ్చలకూరి నాగరాజు, పల్లిపాటి కృష్ణ, అజ్గర్, మట్టా రవీందర్ రెడ్డి, పురుషోత్తం, తుపాకుల వెంకన్న తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది