ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

28న రైతు మేళా రద్దు – మిగతా కార్యక్రమాలు యథావిధిగా


 

ప్రజాపక్షం/ఖమ్మం :  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్ – జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా కార్యక్రమాలు, అలాగే 30 తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు సంబంధించి జిల్లా యంత్రాంగం శనివారం కీలక ప్రకటన విడుదల చేసింది.అనివార్యమైన వాతావరణ పరిస్థితులు, వర్షాల కారణంగా 28-06-2026 (ఆదివారం) నిర్వహించాల్సిన రైతు మేళా కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడించారు.అయితే 29-06-2026 (సోమవారం) నిర్వహించనున్న మెగా రైతు మేళా కార్యక్రమం మరియు 30-06-2026న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.రైతులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు ఈ మార్పును గమనించి కార్యక్రమాలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది