మార్గదర్శకాలు విడుదల
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : జూలై 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల కానున్నందున, అర్హులైన కొత్త పట్టాదారులు జులై 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరారు.రైతు భరోసా పథకం క్రింద ఎకరానికి రూ.6 వేలు, జూన్ 30 న చింతకాని మండలం లో జరిగే రైతు ఆశీర్వాద సభ లో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి రూ.9000 వేల కోట్లు విడుదల చేయనున్నారు.నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అర్హులైన రైతులు,రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అని అధికారులు కోరారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
జూన్ 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకం (PPB) పొందిన రైతులు దరఖాస్తు చెసుకోవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?
• మీ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద లేదా
• మండల వ్యవసాయ అధికారి (MAO) కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
• పట్టాదారు పాస్‌పుస్తకం (PPB)
• ఆధార్ కార్డు
• బ్యాంకు పాస్‌బుక్ (ఆధార్‌తో అనుసంధానమైన ఖాతా)
• మొబైల్ నంబర్
• పట్టాదారు పాస్‌పుస్తకం (లేకపోతే ఆన్లైన్ 1B)
అర్హులైన కొత్త పట్టాదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జులై 5 గడువులోగా దరఖాస్తు చేసుకుని రైతు భరోసా సాయం పొందాలని అధికారులు సూచించారు.

إرسال تعليق