ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం


 

రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి


ప్రజాపక్షం/ముదిగొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు.ఆదివారం ముదిగొండ మండలం రాష్ట్ర సరిహద్దులోని మల్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ముదిగొండ సీఐ మురళితో కలిసి రూరల్ ఏసీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను వెంటనే సీజ్ చేయడంతో పాటు, రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అలాగే ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా వెంటనే జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, సంబంధిత వాహనాలను జప్తు చేయడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని పేర్కొన్నారు.ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా కొనసాగించాలని, ఖమ్మం రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టులలో పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ అక్రమ రవాణాను అడ్డుకునేలా చర్యలు చేపడుతున్నట్లు రూరల్ ఏసీపీ తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم