ప్రజా పక్షం/ వైరా;రైతు ఆశీర్వాద సభకు ముందే రైతులను దీవించిన వరుణదేవుడు అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సూడు చైర్మన్ పూవాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం లో జరగవలసిన రైతు ఆశీర్వాద సభ వాతావరణ పరిస్థితులు కారణంగా రద్దు చేయడం జరిగిందని. నేడు హైదరాబాదులో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు .దేశ చరిత్రలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారధ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేస్తుందని తెలిపారు .రాష్ట్రంలో పండిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసింది, మంచి వాతావరణ పరిస్థితులు చూసి మరోసారి సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోళ్ళ గంగారావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదునురి సీతారాములు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి,విరంశేట్టి సీతారాములు ,చెరుకూరి కిరణ్ ,రాంపూడి రోశయ్య,అన్వర్, ఏలూరు నరసింహారావు ,వడ్డే నారాయణ, మల్లు రామకృష్ణ ,పోలూరు సైదులు ,తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి