ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై సోమవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ వైపు నుంచి ఖమ్మం దిశగా వస్తున్న లారీ, ఖమ్మం నుంచి గొల్లగూడెం వైపు వెళ్తున్న ఆటోను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.మధుకాన్ గ్రానైట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నేలకొండపల్లి మండలానికి సంబంధించిన వ్యక్తిగా తెలిసింది . ఇతను రోజువారి కార్యకలాపాలలో భాగంగా అటువైపుగా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు .
గొల్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం - ఆటో డ్రైవర్ మృతి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి