ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి




ప్రజాపక్షం/ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.మండలంలోని బాణాపురం గ్రామంలో ఓ వ్యక్తి నూతన ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు.ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం  కార్యదర్శి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిసింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم