![]() |
- ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ
ప్రజాపక్షం / సత్తుపల్లి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులకు (బిఎల్ఓ) పూర్తి స్థాయి అవగాహన అవసరమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.సత్తుపల్లి పట్టణ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి బిఎల్ఓకి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ముఖ్యంగా మ్యాపింగ్ ఫారమ్‌లను నింపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఓలు పాటించాల్సిన విధివిధానాలు, బాధ్యతలపై వివరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మండల, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఓలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి