ఓటరుకు ఫారం అందిస్తున్న దృశ్యం
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల ప్రక్రియపై గురువారం అవగాహన కల్పిస్తూ సంబంధిత ఫార్ములను పంపిణీ చేశారు. 120వ బూత్‌కు చెందిన బీఎల్ఓ పోరంకి సరోజిని ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ, సీపీఐ పార్టీలకు చెందిన బీఎల్ఏలు కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫార్ములను అందజేశారు.ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, సవరణలు, కొత్త ఓటరు నమోదు వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు. ప్రతి అర్హుడైన ఓటరు తమ వివరాలను పరిశీలించి అవసరమైన ఫార్ములు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేకల ఉదయ్, కాంగ్రెస్ పార్టీ తరఫున పోతనబోయిన నాగేశ్వరావు, సీపీఐ పార్టీ తరఫున పసుపులేటి ఉదయ్, సీపీఎం పార్టీ తరఫున నందిగామ నాగరాజు, టీడీపీ పార్టీ తరఫున పల్సమ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

إرسال تعليق