ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం 24వ డివిజన్‌లో కాంగ్రెస్ బీఎల్‌ఏల సమావేశం


 ప్రజాపక్షం/ఖమ్మం: ఖమ్మం నగర కార్పొరేషన్ 24వ డివిజన్‌కు చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) కాంగ్రెస్ సమావేశం మాజీ కార్పొరేటర్ గజ్జల లక్ష్మీ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఖమ్మం నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి కమ్మర్తపు మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా దొబ్బల సౌజన్య మాట్లాడుతూ, బీఎల్‌ఏలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించేలా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురి కోసం కాదు, కోట్లాది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సమావేశంలో బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది