ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

28, 29వ వార్డుల్లో ముమ్మరంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ


 రెండు వార్డుల్లో కలిపి 2800 అప్లికేషన్లకు గాను 250 రిటర్న్

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28, 29 వార్డుల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు బి ఎల్ వో లు ఏకలక్ష్మి, దండి శ్రీలత శ్రీరామ్నగర్ లోని దర్గా వద్ద శనివారం పత్రాలను సేకరించారు. ఇప్పటికే ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.ఈ రెండు వార్డుల్లో కలిపి మొత్తం 2,800 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా, ఇప్పటివరకు సుమారు 250 ఫారాలు తిరిగి అందినట్లు బి ఎల్ వో లు తెలిపారు. వీటిలో 28వ వార్డులో 100, 29వ వార్డులో 150 ఫారాలు పూర్తిచేసి బీఎల్‌ఓలకు అందజేశారు.ఫారాలు నింపే విషయంలో ప్రజలకు ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ, అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ బీఎల్‌ఓలు సహకారం అందిస్తున్నారు. మిగిలిన ఫారాలను కూడా త్వరితగతిన సేకరించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను  విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది