శ్రీరామ్ నగర్ ద్వారం వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు శ్రీకారం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే శాబాదు నగర్లో పైప్‌లైన్ ఏర్పాటు పనులు జరుగుతుండగా, తాజాగా శ్రీరామ్ నగర్ ప్రధాన రహదారి నుంచి కార్ డెక్కర్ షోరూమ్ మీదుగా వార్డు చివరి వరకు కొత్త పైప్‌లైన్ ఏర్పాటు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో 28వ వార్డు సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో ప్రతి ఇంటికి నాణ్యమైన మిషన్ భగీరథ తాగునీరు అందేలా పైప్‌లైన్ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు.స్థానిక ప్రజలు ఈ పనులు పూర్తయితే తాగునీటి ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి