మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం క్యాంపు కార్యాలయం ఖమ్మం రూరల్ మండలంలో ఘనంగా 77వ జయంతి వేడుకలు
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంతకుముందు ఖమ్మం నగరంలోని 16వ డివిజన్, 7వ డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని కొండాపురంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు దయాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్సార్ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, కార్యకర్తలంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, బోడా మంగీలాల్, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు తోట వీరభద్రం, నాయకులు కల్లెం వెంకట్ రెడ్డి, బండి జగదీష్, డివిఆర్ బాబు, మద్ది మల్లారెడ్డి, పుల్లయ్య, లింగాల రవికుమార్, మందడపు రామకృష్ణ రెడ్డి, మందడపు మనోహర్, ఉమ్మినేని కృష్ణ, భీమనాథుల అశోక్ రెడ్డి, కొప్పెర ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, షేక్ ఇమామ్, చింతమల్ల గురుమూర్తి, బోడా శ్రావణ్ కుమార్, తాళ్లూరి రాము, చంద్రు నాయక్, బాణోతు దివ్య, బట్టపోతుల సతీష్, చల్లా కృష్ణారెడ్డి, హారిక నాయుడు, మొగిలిచర్ల సైదులు, ఎయిర్టెల్ నర్సింహారావు, వెనిగళ్ళ నాగేశ్వరరావు, ఆటోప్రసాద్, నాగరాజు, విప్లవ్ కుమార్, మద్ది వీరారెడ్డి, వెంపటి రవి, పంతులు నాయక్, చింతమల్ల రవి, బండి సతీష్, కన్నెటి అనిల్, తంబి, కరాటే వేణు, ఉపేందర్, రాజు, తిరుపతమ్మ, రుడావత్ రమాదేవి, కన్నెగంటి రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి