సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు
చైతన్య నగర్ కాలనీవాసుల ఘన సన్మానం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీలోనే తన వార్డును అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని సిపిఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు తెలిపారు. సోమవారం 28వ వార్డులోని చైతన్య నగర్లో కాలనీవాసులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు శాలువాతో సన్మానించి మెమొంటాను అందజేసి అభినందనలు తెలిపారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో దండి రంగారావు మాట్లాడుతూ..వార్డులో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మట్టి రోడ్ల స్థానంలో దశలవారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి మిషన్ భగీరథ పైప్‌లైన్ విస్తరణ పనులు కూడా ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు.వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, డ్రైనేజీలు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, తాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలు సూచించే సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శకంగా సేవలందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్ , చైతన్య నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి