రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు వైరాలో ఆందోళన
ప్రజాపక్షం/ వైరా:విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వైరా డివిజనల్ కార్యాలయం వద్ద సోమవారం ఎన్పీడీసీఎల్ (NPDCL) ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు సబ్సిడీల కొనసాగింపు కష్టసాధ్యమవుతుందని, విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.అదే విధంగా విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని, కార్మికులు, ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడితేనే ప్రజా రంగ సంస్థలను పరిరక్షించుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర పవర్ జేఏసీ కార్యవర్గ సభ్యులు రాజరత్నం, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, ఎం. ప్రసాద్, జార్జి, ట్రేడ్ యూనియన్ నాయకులు, వైరా ఎలక్ట్రికల్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఏఏఓ సురేష్, అధికారులు రాజా సిన్హా, వర్మ, మంజుల శ్రీజ, వీరభద్రరావు, పాషా, కృష్ణప్రసాద్, వివేక్‌తో పాటు పలువురు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి