కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి చొరవతో బోరు పనులకు శ్రీకారం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ 31వ వార్డు ఎస్సీ కాలనీలో చాలా కాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. వేసవి కాలంతో పాటు ఇటీవల కూడా తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వార్డు కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి సమస్యను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి బోరు మంజూరు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.మంజూరైన బోరు పనులను శనివారం కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తాగునీరు ప్రతి కుటుంబానికి అత్యవసర అవసరమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా జరిగేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.బోరు ఏర్పాటు పూర్తయిన తర్వాత ప్రజలకు తాగునీటి సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే గుర్తించి స్పందించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో పాటు చొరవ చూపిన కౌన్సిలర్ హైమావతి సుదర్శన్ రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నేకంటి అనీష్, మాల్సూర్, ఏపూరి శ్రీహరి, ఏపూరి కృష్ణ, ఏపూరి నాగయ్య, బొడ్డు వీరభద్రం, బొడ్డు వెంకటేష్, ఏపూరి ప్రతాప్, ఏపూరి గోపి, ఏపూరి చిన్న గోపి, మామిడ్ల పవన్ రెడ్డి, అరేంపుల నరేష్, యమునకర్, మామిడాల కిరణ్, రాయల వీరభద్రం, కోయల యాకయ్య, రామాయల లాలు ప్రసాద్, నారపాటి నాగరాజు, డీజే బాలు, నారపాటి మురళి, పొన్నేకంటి మనోహర్, వేర్పుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق