ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

500 కోట్లతో వైరా మున్సిపాలిటీ అభివృద్ధి... ఎమ్మెల్యే రాందాస్ నాయక్


 రూ.50.82 కోట్లతో అభివృద్ధి పనులు

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది

ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ప్రజాపక్షం/ వైరా: వైరా మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.500 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అదనంగా రూ.50.82 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో శాంతినగర్ నుంచి గండగలపాడు సాయిబాబా ఆలయం వరకు, వైరా రింగ్‌రోడ్ నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అలాగే పాత గ్రామపంచాయతీ ఆస్పత్రి నుంచి రిజర్వాయర్ వరకు వాకింగ్ ట్రాక్ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో వైరా మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దులో కేంద్ర ప్రాంతంగా ఉన్న వైరాను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించడం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చెప్పారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రూ.4 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 కోట్లు, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు, గ్రంథాలయ అభివృద్ధికి రూ.1 కోటి కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో విద్యుత్ శాఖ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన జరుగుతుందని, రింగ్‌రోడ్ వద్ద రూ.8 కోట్లతో వ్యాపార సముదాయం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని, గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఇప్పటికీ వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణా, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, ఎదునూరి సీతారాములు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు ఉండ్రు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది