ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు రాకతో బిఆర్ఎస్ పూజలు


 గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు

కేసీఆర్ కృషి ఫలితమేనని కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వర్లు

ప్రజాపక్షం/వైరా: వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరిన సందర్భంగా శనివారం వైరాలోని రిజర్వాయర్ బతుకమ్మ ఘాట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు , బాణాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని అన్నారు. ఈ ప్రాంత వ్యవసాయాభివృద్ధి కోసం గోదావరి–కృష్ణా జలాలను అనుసంధానం చేస్తూ సీతారామ ప్రాజెక్టును నిర్మించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే 80 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కేసీఆర్ నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరడం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, కృషికి నిదర్శనమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వేగంగా పనులు పూర్తిచేయించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.గోదావరి జలాల రాకతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాలు సాగులోకి వచ్చి రైతులకు మేలు జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడాలనే సంకల్పమే నేడు ఫలించిందని కట్టా కృష్ణార్జునరావు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కట్టా స్వరూప రాణి, మాదినేని సునీత, చిలకా కోటయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మద్దేల రవి, అప్పం సురేష్, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, లాల్ మహమ్మద్, దారెళ్లి పవిత్ర కుమారి, పరుచూరి రామారావు, నూకల వాసు, నూకల ప్రసాద్, ఎదునూరి శ్రీను, కోల్ల రాంబాబు, ఏనుగు హనుమంతరావు, వజినేపల్లి చక్రవర్తి, మాదినేని లక్ష్మణ్, ఆదూరి ప్రేమ్, కారుకొండ బోసు, వేముల శివకుమార్, తన్నీరు నాగేశ్వరరావు, దాసరి శ్రీను, మాచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది