ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రూ.94 లక్షల ఆన్‌లైన్ పెట్టుబడి మోసం కేసులో ఇద్దరు అరెస్ట్


కేరళలో పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు

ప్రజాపక్షం/ఖమ్మం క్రైమ్ : ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.94 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు సైబర్ నేరస్థులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా పరిచయమైన నిందితులు "డొలేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్" పేరుతో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. వాట్సాప్, ట్రేడింగ్ లింకులు, మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా బాధితుడితో సుమారు రూ.94 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ.13 లక్షలు జమ అయిన బ్యాంకు ఖాతాల ఆధారంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆశీనా, నిసాముద్దీన్‌లను అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై వారిని ఖమ్మంకు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు సీపీ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్.ఆర్.వి. ఫణీందర్, సీఐ రవికుమార్, ఎస్‌ఐలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకట కృష్ణారావు, నాగేంద్ర, కృష్ణప్రసాద్, స్వప్నతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది