ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంను సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ బుధవారం పరామర్శించారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న తమ్మినేనిని బృందా కారత్ బుధవారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని పోరాట యోధుడని కొనియాడారు.సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి వచ్చి అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాలా సంసిద్ధం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకురాలు ఆశాలత,పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ,ఐద్వా నాయకురాలు మాచర్ల భారతి,మెరుగు రమణ తదితరులు ఉన్నారు.
తమ్మినేని పరామర్శించిన బృందా కారత్
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి