ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బాటిల్ బార్‌లో దారుణం..!


మైనర్‌కు మద్యం.. చట్టం చెల్లదా..?

నిబంధనలకు తూట్లు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి మద్యం విక్రయించడం, అందించడం చట్టరీత్యా నిషేధం. అయితే ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ బాటిల్ బార్‌లో మైనర్ బాలుడికి మద్యం అందించినట్లు ప్రచారంలోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో, అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తున్న బాలుడు నిజంగా మైనరేనా? అయితే అతడికి మద్యం ఎవరు అందించారు? బార్ సిబ్బంది వయస్సు ధ్రువీకరించకుండా మద్యం విక్రయించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.స్థానికుల ఆరోపణల ప్రకారం, సదరు బార్‌లో నిబంధనల అమలుపై గతంలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయని, తనిఖీలు లేకపోవడంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. "డబ్బు ఉంటే చాలు... ఎవరైనా, ఎప్పుడైనా" అన్నట్లుగా సేవలు అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకవేళ వైరల్ అవుతున్న ఘటన నిజమే అయితే, ఇది కేవలం ఒక బార్ నిర్లక్ష్యం మాత్రమే కాదు.. మైనర్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడినట్టేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఎక్సైజ్ శాఖ, పోలీసులు వెంటనే విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم