ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చిమ్మ చీకటిలో డివైడర్ను ఢీ కొట్టిన డీసీఎం


 హెచ్చరికలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఓ డీసీఎం వాహనం, నూతనంగా నిర్మించిన డివైడర్ వద్ద తగిన లైటింగ్ లేకపోవడంతో డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డీసీఎం ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, డివైడర్ సుమారు అడుగు మేర ధ్వంసమైంది. బలంగా ఢీకొట్టడంతో వాహనం సైతం అదుపుతప్పి రోడ్డుపైనే అడ్డంగా పడిపోయింది.డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఇటీవల నిర్మిస్తున్న డివైడర్ పనులు ఇంకా పూర్తికాకపోవడం, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలు పునరావృతం కాకుండా డివైడర్ పనులను వెంటనే పూర్తి చేసి, తగిన లైటింగ్, హెచ్చరిక సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم