ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పీఎస్‌ఆర్ సోషల్ మీడియా వారియర్ తండ్రిని పరామర్శించిన మంత్రి పొంగులేటి


 మంత్రి రాకతో చింతపల్లిలో ఆత్మీయ వాతావరణం..

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన పీఎస్‌ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరెంపుల బద్రి సాయి తండ్రి, మాజీ సర్పంచ్ ఆరెంపుల మంగమ్మ భర్త వెంకటరత్నంను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం వారి నివాసంలో పరామర్శించారు.ఇటీవల అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న వెంకటరత్నం ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ సర్పంచ్ మంగమ్మను ఆత్మీయంగా పలకరిస్తూ, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మంత్రి తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో వెంకటరత్నం నివాసానికి చేరుకున్నారు. వారితో మంత్రి ఆప్యాయంగా ముచ్చటిస్తూ, "తల్లుల్లారా... ఎలా ఉన్నారు?" అంటూ పలకరించి, వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆప్యాయ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కౌన్సిలర్లు దివ్య, సురేష్, మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, ఆరెంపుల గ్రామ సర్పంచ్ బండి సతీష్, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్, మద్దులపల్లి మార్కెట్ డైరెక్టర్, మాజీ సర్పంచ్ ముత్యం చిన్న కృష్ణారావు, ఎస్సీ సెల్ నాయకుడు ఆరంపుల రామయ్య , గ్రామ కాంగ్రెస్ నాయకుడు తోట రామకృష్ణతో పాటు జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم