ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎదురెదురుగా రెండు లారీలు ఢీ..!


 క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్

ప్రజాపక్షం/జూలూరుపాడు :భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ వైపునుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ, పాల్వంచ నుండి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ లు ఒకదానికొకటి ఏదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు యస్ ట్యాంకర్ లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు స్థానికుల సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటికి తీశారు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో కొత్తగూడెం, ఖమ్మం వేళ్ళు మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم