ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రామవరం మాతా శిశు ఆసుపత్రిలో దారుణం


 వైద్యుల నిర్లక్ష్యంతో వార్డులోనే నిలబడి ప్రసవం.. కిందపడిన నవజాత శిశువుకు తీవ్ర గాయాలు

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. సిబ్బందితో కుటుంబ సభ్యుల వాగ్వాదం

ప్రజాపక్షం/కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని రామవరం మాతా శిశు ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ములకలపల్లి మండలం కుంకారపాడు గ్రామానికి చెందిన భవాని తన తొలి ప్రసవం కోసం భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది. అయితే, డాక్టర్లు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో వార్డులోనే నిలుచుని ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ క్రమంలో జన్మించిన నవజాత శిశువు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గర్భిణికి సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని, వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శిశువుకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది