తహసీల్దార్‌తో పాటు ఇద్దరు ఆర్‌ఐలకు బదిలీ
ప్రజాపక్షానికి రైతుల కృతజ్ఞతలు వెల్లువ
ప్రజాపక్షం/ బోనకల్ : భూ లావాదేవీలకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. "వారసత్వానికి తూట్లు.. భూభారతికి వక్ర భాష్యం" అనే శీర్షికతో ప్రజాపక్షం దినపత్రిక సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు.విచారణలో ప్రజాపక్షం కథనంలో పేర్కొన్న అంశాలు వాస్తవమేనని ప్రాథమికంగా తేలడంతో బోనకల్ మండల తహసీల్దార్‌తో పాటు ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. తహసీల్దార్ సుధాకర్‌ను కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి, ఆర్‌ఐ–1 మైథిలిని కూసుమంచి మండలానికి, ఆర్‌ఐ–2ను ఏన్కూర్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ బదిలీలతో బోనకల్ మండల రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాపక్షం వెలుగులోకి తీసుకొచ్చిన కథనానికి విశేష స్పందన లభించగా, భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పలువురు బాధిత రైతులు పెద్ద సంఖ్యలో ఫోన్ చేసి ప్రజాపక్షంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
"నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తే స్పందన తప్పదని మరోసారి ప్రజాపక్షం కథనం నిరూపించింది."


చాలా మంచి పని చేశారు. చాలా రోజుల తర్వాత ఒక దమ్మున్న వార్తలు చదువుతున్నాను. గ్రేట్ ప్రజాపక్షం వారికి ధన్యవాదాలు
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి