ప్రజా పక్షం /వైరా:మధిర రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా దెబ్బతిని నిత్య ప్రమాదాలకు నిలయమైన మధిర రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద సిపిఎం శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుకు ఇరు వైపులా కిలో మీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం, సుంకర సుధాకర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టి మూడు సంవత్సరాలు అవుతున్నా నేటికీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు. రోడ్డు పూర్తిగా దెబ్బతిని మోకాళ్ళ లోతు గుంటలు పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఆర్ అండ్ బి అధికారులు పనుల నాణ్యతపై పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ధర్నా వద్దకు చేరుకుని కాంట్రాక్టర్, అర్ ఎండ్ బి అధికారులతో మాట్లాడి రోడ్డుపై గుంతలకు వెంటనే మరమ్మతులు చేపిస్తామని, నిర్మణ పనులు నాణ్యతగా త్వరగా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బాణాల శ్రీనివాసరావు, తూము సుధాకర్, తోట నాగేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల రజిత, కొంగర సుధాకర్, గుడిమెట్ల మోహన్ రావు, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, ద్రోణాదుల నాగేశ్వరరావు, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, మల్లెంపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి