ప్రజా పక్షం/వైరా: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జన్మదిన వేడుకలను వైరాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మల్లికార్జున ఖార్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మల్లికార్జున ఖార్గే ప్రజాసేవలో విశిష్ట పాత్ర పోషిస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చురుకుగా సేవలందించాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు, ఎగ్జిక్యూటివ్ నెంబర్ వాంకుడోత్ భిక్యా, ఏన్కూర్ మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్ణ నరేందర్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమతాల రేణుక, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొప్పుల ప్రభావతి రెడ్డి, జిల్లా సెక్రెటరీ షేక్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొట్టే రాజశేఖర్, సెక్రెటరీ సామెల్, సెక్రటరీ పాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి