ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ – నిత్యావసర సరుకులు, సోలార్ లైట్ల పంపిణీ


 ప్రజాపక్షం/కరకగూడెం: గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజలతో సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో "కమ్యూనిటీ కనెక్ట్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నీలాద్రిపేట, గండి, అశ్వాపురంపాడు, గుత్తికోయ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలు, మహిళల అవసర వస్తువులు, సోలార్ విద్యుత్ లైట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమైన పోలీసులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.అనంతరం గ్రామస్తులకు మద్యపానం, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించి విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడుల్లా–బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భూసారపు రమేష్, పోలీస్ సిబ్బంది, సంస్థ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది