ఓటమికి కుల సమీకరణలే కారణమని అభ్యర్థి ఆరోపణ.. ప్రత్యర్థి వర్గం ఘాటు కౌంటర్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఐదు వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. సమావేశంలో ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి, తన ఓటమికి కుల సమీకరణల పేరుతో తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.దీనికి స్పందించిన మరో వర్గం నాయకులు, "నువ్వు ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అభ్యర్థి వద్దకు వెళ్లి ఆశీస్సులు కోరితే అది తప్పు కాదా? మేము మాట్లాడితే మాత్రం కులం పేరుతో ఆరోపణలు చేస్తావా?" అంటూ ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలిసింది.అయితే అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్ నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి, పార్టీలో కుల రాజకీయాలకు తావు ఉండకూడదని, వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.ఈ ఘటన స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి