ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మావోయిస్టులు పూర్తిగా అంతం కాలేదు


   డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

ప్రజాపక్షం/క్రైమ్ : మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా అంతరించిపోయాయని భావించడం లేదని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల కదలికలను మరో రెండేళ్ల పాటు నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.మావోయిస్టుల ప్రభావం తగ్గిన నేపథ్యంలో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో మావోయిస్టులు గంజాయి సాగుదారులపై దాడులు చేసి అడ్డుకునేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు.గంజాయి సాగు, అక్రమ రవాణాపై గ్రేహౌండ్స్‌తో పాటు రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని డీజీపీ తెలిపారు. గంజాయి నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని పాత సిపి ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది