26వ వార్డులో పాల్గొన్న తుంబురు దయాకర్ రెడ్డి
సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తిన చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీతల భవాని అమ్మవారి పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 26వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత సాంప్రదాయబద్ధంగా సీతల భవాని బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్, కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి, బానోత్ హరి, కౌన్సిలర్లు బానోతు పూల్చంద్, బానోత్ దివ్య , టెలికాం డైరెక్టర్ రంజిత్ నాయక్ , మూడ్ నారాయణ, బానోత్ సత్తి , బానోత్ సునీల్, బానోత్ గడ్డ, ధరావత్ బాద్య , ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో పండుగ వైభవంగా సాగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి