రేకుల షెడ్డు లోనే ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల నిర్వహణ
ఫ్రీ ప్రైమరీ లో ( INSTRUCTOR ) కు బదులు ఆయా ఇంగ్లీష్ బోధనలు
గోపాలపురం అంగన్వాడి కేంద్రం ఎనక భాగంలో ప్రాథమిక పాఠశాల కు రేకులు షెడ్డు...
ప్రజాపక్షం/తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలో ప్రభుత్వ విద్య గాడిదపుతుంది అధికారుల అలసత్వం దీనంతటికీ కారణం ఒక టీచర్ ఒక విద్యార్థి ఉన్నచోట ప్రాథమిక పాఠశాలలకు పక్కా బిల్డింగులు 20 మంది విద్యార్థులు ఉన్నచోట రేకుల షెడ్ లో ప్రాథమిక పాఠశాల నిర్వహణ ప్రభుత్వం విద్యార్థులకు ప్రాథమిక దశనించే పటిష్టమైన విద్య వ్యవస్థను నెలకొల్పి విద్యార్థులు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయల ఖర్చు చేస్తుంటే తిరుమలాయపాలెం మండలంలో ఆచరణ సాధ్యం కావట్లేదు.. మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురం లో 2000 సంవత్సరంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల బిల్డింగు శిథిలావస్థకు చేరడంతో కొంతకాలం అద్దె గదులలో విద్యార్థులకు పాఠాలు బోధించగా అద్దె భవనం వారు ఖాళీ చేయించడంతో చేసేది ఏమీ లేక అంగన్వాడి కేంద్రం వెనకాల రేకుల షెడ్డు ను అక్కడే విధులు నిర్వహిస్తున్న టీచర్ ఇందిరా సొంత నిధులతో రేకుల షెడ్డు ఏర్పాటు చేసి రేకుల షెడ్డు లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంది.. మొత్తం పాఠశాలలో 17 మంది విద్యార్థులు ఉండగా దాంట్లోనే ప్రీ ప్రైమరీ కి సంబంధించిన విద్యార్థులు ఐదుగురు కలరు పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రంలో మొత్తం పదిమంది చిన్నారులు ఉండగా దానిలో నుంచి అయిదుగురు ప్రీ ప్రైమరీకి వెళ్లారని అంగన్వాడి కేంద్రంలో ఐదుగురు పిల్లలు ఉన్నారని అక్కడ టీచర్ రాజమ్మ తెలిపారు.. ప్రీ ప్రైమరీ లో విద్యార్థులకు ఇంగ్లీషు నేర్పించవలసిన ( INSTRUCTOR ) జోగుపర్తి సాద్విని రిజైన్ చేయగా అక్కడే ప్రీ ప్రైమరీ లో ఆయాగా విధులు నిర్వహిస్తున్న కళ్యాణి పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా గోపాలపురం ప్రాథమిక పాఠశాలకు పక్కా బిల్లింగ్ ను నిర్మించాలని స్థానిక మాజీ సర్పంచ్ గడ్డి కొప్పుల రాజు.. స్థానిక ప్రజలు కోరుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి