ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పొన్నెకల్లు స్టేజి వద్ద విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


 

తల్లంపాడు గ్రామానికి చెందిన 17 ఏళ్ల షేక్ మోసిన్ గా గుర్తింపు

 మరో యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు స్టేజి సమీపంలో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ మోసిన్ (17) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఎస్కే జహీర్ తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, షేక్ మోసిన్, ఎస్కే జహీర్ ఇద్దరూ తల్లంపాడు గ్రామంలోని తమ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వైపు బయలుదేరారు. పొన్నెకల్లు స్టేజి సమీపానికి చేరుకోగానే వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో షేక్ మోసిన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్కే జహీర్‌కు చేయి విరగడంతో పాటు ఇతర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో తల్లంపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది