32 లక్షల విలువ చేసే 32 తులాల బంగారు ఆభరణాలు రికవరీ
ప్రజాపక్షం /ఖమ్మం క్రైమ్ :దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి,సీసీఎస్ ఏసీపీ సర్వర్ తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్, సిసిఎస్ పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులో కి తీసుకోని విచారించగాఖమ్మం జిల్లా , మధిర మండలం, ఆత్కూరు గ్రామం కు చెందిన సెన్ట్రింగ్ వర్కర్ కంబంపాటి ఏసోబు @ కందుల సురేష్ రెడ్డి గా గుర్తించినట్లు తెలిపారు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.పలుసార్లు జైలు శిక్షలు అనుభవించాడని ,ఇతనిపై గతంలో 22 దొంగతనాల కేసులలో నిందితుడు గా ఉన్నట్లు తెలిపారు.నిందితుడు నుండి 32 లక్షల విలువ చేసే 32 తులాల బంగారు ఆభరణాలు, 40 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. గత సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్లు ఖమ్మం 2వ టౌన్ 4, ఖానాపురం హవేలీ 3, వేంసూరు 1,VM బంజర 1, చిల్లకల్లు 1, తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనాలు చేసాడని ఏసీపీ తెలిపారు.ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్లు, కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి