ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా వనజీవి రామయ్య 90వ జయంతి వేడుకలు


 

ప్రజాపక్షం/మణుగూరు : మణుగూరు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ శ్రీ వనజీవి రామయ్య @ దరిపల్లి రామయ్య గారి 90వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన వనజీవి రామయ్య ఆశయాలను కొనసాగిస్తామని, మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, లైన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ప్రతినిధులు, మాజీ సర్పంచ్ ఎల్‌.ఎన్‌. దొబ్బల వెంకటప్పయ్య, కోశాధికారి యాదగిరి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, సేవారత్న అవార్డు గ్రహీత కడవెండి విశ్వనాథ్ గుప్తా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లగట్ల సత్య ప్రకాష్, అధ్యాపకులు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగం రవి, ఎండి యాకూబ్ అలీ, ద్వాలి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది