ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కౌన్సిలర్‌కు కౌన్సిలర్ పరామర్శ...


 అనారోగ్యంతో ఉన్న తమ్మినేని మంగతాయిని పరామర్శించిన దండి రంగారావు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్, దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య సతీమణి తమ్మినేని మంగతాయిని 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు శనివారం ఆమె నివాసంలో పరామర్శించారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మంగతాయిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆమె ధైర్యంగా ఉండాలని, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم