7 గ్రాముల బంగారంతో పరార్ – సీసీటీవీలో నిందితుడి దృశ్యాలు
ప్రజాపక్షం/ జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఫేక్ ఫోన్‌పే లావాదేవీతో ఓ బంగారు నగల దుకాణంలో చోరీ జరిగింది.మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చేతన్ జువెలరీ షాపులో సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన రవి ఈ జువెలరీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.యజమాని తెలిపిన వివరాల ప్రకారం, ఓ గుర్తు తెలియని వ్యక్తి దుకాణానికి వచ్చి బంగారు నగలు కొనుగోలు చేసినట్లు నటించి, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించినట్లు నకిలీ (ఫేక్) లావాదేవీ చూపించాడు. అనంతరం బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.కొద్దిసేపటి తర్వాత ఖాతాను పరిశీలించిన దుకాణ యజమానికి డబ్బులు జమ కాలేదని తెలిసింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిచినా స్పందించకుండా పరారయ్యాడు.ఈ ఘటనలో సుమారు 7 గ్రాముల బంగారం, దాదాపు రూ.1.05 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు.ఘటన అనంతరం దుకాణంలోని సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేసిన యజమాని, నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి